Dharmendra Pradhan: గవర్నర్ తో మీటింగ్, సీఎంతో లంచ్... నేడు ఏపీకి సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్

  • ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు
  • తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ తో సమావేశం
  • ఆపై జగన్ తో పలు అంశాలపై చర్చలు

కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకునే ఆయన, తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవుతారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తారు. మధ్యాహ్న భోజనాన్ని ఆయనతో కలిసి చేస్తారు.

 ఆపై రాజమండ్రికి చేరుకుని, నాగాయలంక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశమవుతారు. ధర్మేంద్ర ప్రధాన్ రాకను పురస్కరించుకుని, బీజేపీ శ్రేణులు ఇప్పటికే రాజమండ్రి, నాగాయలంక పరిసరాలల్లో  స్వాగతం పలుకులతో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Dharmendra Pradhan
Jagan
Bishvabhushan
Andhra Pradesh
Governor
  • Loading...

More Telugu News