Rohit Sharma: రోహిత్ శర్మ మెరుపులు... రెండో టి20లో టీమిండియా విజయం

  • రాజ్ కోట్ మ్యాచ్ లో బంగ్లా ఓటమి
  • 1-1తో సమం చేసిన భారత్
  • నవంబరు 10న మూడో టి20

రాజ్ కోట్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు బాటలో నిలపగా, కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు.

అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కాగా, టీమిండియా ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్ పూర్ లో జరగనుంది.

Rohit Sharma
India
Bangladesh
T20
Rajkot
  • Loading...

More Telugu News