Rajkot: రాజ్ కోట్ టి20: టీమిండియా టార్గెట్ 154 రన్స్ 

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
  • మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసిన బంగ్లా

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించాడు. మొదట్లో ధాటిగా ఆడిన బంగ్లా ఆటగాళ్లు ఆ తర్వాత నిదానించారు. ఓపెనర్ లిటన్ దాస్ (29), మహ్మద్ నయీం (36) శుభారంభాన్ని అందించారు. సౌమ్య సర్కారు 30, కెప్టెన్ మహ్మదుల్లా 30 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 2, చహర్, ఖలీల్ అహ్మద్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

Rajkot
Team India
Bangladesh
T20
  • Error fetching data: Network response was not ok

More Telugu News