Ravishastri: తల్లితో చిరునవ్వులు చిందిస్తూ రవిశాస్త్రి... వైరల్ అవుతున్న ఫొటో!

  • నేడు రవిశాస్త్రి తల్లి జన్మదినం
  • అమ్మకు ట్విట్టర్ లో విషెస్ తెలిపిన రవిశాస్త్రి  
  • తనకు అతిపెద్ద విమర్శకురాలు తల్లేనని వెల్లడి

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎంతో సరదా వ్యక్తి. అందుకే టీమిండియా క్రికెటర్లలో అత్యధికులు ఆయనే తమ కోచ్ గా ఉండాలని కోరుకుంటారు. కుర్రాళ్లతో ఇట్టే కలిసిపోయే రవిశాస్త్రి మరోసారి ప్రధాన కోచ్ గా బాధ్యతలు అందుకోవడం తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే, రవిశాస్త్రి తల్లి లక్ష్మీ శాస్త్రి నేడు పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి 80వ జన్మదినోత్సవం సందర్భంగా రవిశాస్త్రి ట్విట్టర్ లో ఓ ఫొటో పోస్టు చేశారు. అందులో తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న రవిశాస్త్రిని చూడొచ్చు. తల్లే తనకు అతిపెద్ద విమర్శకురాలని, తనకు స్ఫూర్తి కూడా ఆమేనని రవిశాస్త్రి ట్వీట్ లో వెల్లడించారు. తన తల్లికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Ravishastri
Mother
Birth Day
Lakshmi Shastri
  • Loading...

More Telugu News