KTR: సీఎం కేసీఆర్ కార్యకర్తలను సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు: మంత్రి కేటీఆర్

  • మరణించిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేత
  • ఇప్పటివరకు రూ.31.62 కోట్లు చెల్లింపు
  • కార్యకర్తల సభ్యత్వం 60 లక్షలకు చేరిందని ప్రకటన

టీఆర్ ఎస్ పార్టీ, కార్యకర్తల కుటుంబాలకు  అండగా ఉంటుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ కార్యకర్తలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని పేర్కొన్నారు. మరణించిన టీఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు తలా రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 1581మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.31.62 కోట్లు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ కార్యకర్తల సభ్యత్వం 60 లక్షలకు చేరుకుందన్నారు. ఈ విషయంలో దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో తమదే అగ్రస్థానమని అన్నారు.

KTR
TRS
party workers
cheques distribution
  • Loading...

More Telugu News