Jagan: వైఎస్ జగన్ కు అర్చకులంతా రుణపడి ఉంటారు: రమణ దీక్షితులు

  • మరో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలన్న రమణ దీక్షితులు
  • రమణ దీక్షితులను టీటీడీ ఆగమ సలహాదారుగా నియమించిన సర్కారు
  • జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న రమణ దీక్షితులు

టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా నియమితుడైన రమణ దీక్షితులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వంశ పారంపర్య అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయంపై అర్చకుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయని, ఆయనకు అర్చకులంతా రుణపడి ఉంటారని తెలిపారు.

తనకు శ్రీవారి ఆగమ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, శ్రీవారికి కైంకర్యాలు చేసే అవకాశం కల్పిస్తామన్నారని రమణ దీక్షితులు తెలిపారు. మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Jagan
YSRCP
TTD
Andhra Pradesh
Ramana Dikshitulu
  • Loading...

More Telugu News