Chinthamaneni Prabhakar: చింతమనేనికి ఈనెల 20 వరకు రిమాండ్

  • కొత్తగా నాలుగు కేసులు నమోదు
  • పాత కేసుల్లో రిమాండ్ అదే తేదీకి పొడిగింపు
  • పీటీ వారెంట్ పై ఏలూరు జిల్లా కోర్టులో హాజరైన చింతమనేని

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జిల్లా కోర్టు ఈ నెల 20వరకు రిమాండ్ విధించింది. తాజాగా చింతమనేనిపై మరో నాలుగు కేసులు పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయనను ఏలూరు జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీస్ స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న చింతమనేనిని పీటీ వారెంట్ పై కోర్టులో హాజరయ్యారు. ఈ కేసుల్లో ఆయనకు 20 వరకు రిమాండ్ విధిస్తూ.. పాత కేసుల్లో కూడా ఆయన రిమాండ్ ను అదే తేదీవరకు పొడిగిస్తూ  కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.


Chinthamaneni Prabhakar
Remand november 20
Extention
Eluru court
Telugudesam Ex MLA
  • Loading...

More Telugu News