Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు ఇదే నా సవాల్: అచ్చెన్నాయుడు

  • ఎన్ని భవన నిర్మాణాలున్నాయో బొత్సకు చూపిస్తాను
  • ఏపీ రాజధానిపై తప్పుగా మాట్లాడానని బొత్స ఒప్పుకోవాలి 
  • 12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణాలున్నాయి 

ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని దేశ పటంలో కూడా లేకుండా చేశారని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పేదలకు కనీసం ఒక్క ఇల్లయినా ఇచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. బొత్స వ్యాఖ్యలపై సవాల్ విసురుతున్నానని అన్నారు.

అమరావతిలో ఎన్ని భవన నిర్మాణాలున్నాయో బొత్సకు చూపిస్తానని, ఏపీ రాజధానిపై తప్పుగా మాట్లాడానని బొత్స ఒప్పుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. 12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణాలున్నాయని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని వ్యాఖ్యానించారు. బొత్స అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు నాయుడే ప్రజలకు గుర్తొస్తారని వైసీపీ నేతలకు తెలుసని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పేదలకు తాము 5 వేల గృహాలు నిర్మిస్తే, బొత్స మాత్రం నిర్మించలేదంటున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Botsa Satyanarayana
achennaidu
Telugudesam
  • Loading...

More Telugu News