Yediyurappa: నా నియోజకవర్గానికి నేను రూ.700 కోట్లు అడిగితే, యడియూరప్ప రూ. 1000 కోట్లు ఇచ్చారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణగౌడ

  • మద్దతివ్వాలని యడియూరప్ప నన్ను అడిగారు
  • నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 700 కోట్లు ఇవ్వాలని అడిగాను
  • రూ. 1000 కోట్లు ఇస్తానని ఆయన చెప్పారు

తన నియోజకవర్గం కృష్ణరాజపేట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యడియూరప్ప రూ. 1000 కోట్లు ఇచ్చారని అనర్హత వేటు పడ్డ జేడీఎస్ ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు.

'ఒక రోజు తెల్లవారుజామున నా వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు ఉదయం 5 గంటలకు యడియూరప్ప నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యడియూరప్ప పూజలో ఉన్నారు. నన్ను కూర్చోమని చెప్పి, ఆ తర్వాత నాతో మాట్లాడారు. తనకు మద్దతు పలకాలని, మరోసారి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు.

దాంతో నా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 700 కోట్లు ఇవ్వాలని నేను అడిగాను. రూ. 1000 కోట్లు ఇస్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ నిధులను ఆయన కేటాయించారు. అలాంటి గొప్ప వ్యక్తికి నేను మద్దతివ్వకూడదా? యడియూరప్ప మాటలను విన్న తర్వాత అనర్హత వేటు పడినా పర్వాలేదనిపించింది' అని నారాయణగౌడ తెలిపారు.

Yediyurappa
Narayana Gowda
JDS
BJP
1000 Crore
  • Loading...

More Telugu News