Dirt: ఉచితంగా మట్టి కావాలని ఫేస్ బుక్ లో పెడితే... 100 లారీలు తెచ్చిపోశారు!

  • యూఎస్ లోని వర్జీనియాలో ఘటన
  • మట్టి కావాలని సోషల్ మీడియాలో యాడ్
  • శుభ్రం చేసుకునేందుకు 2.5 లక్షల డాలర్ల ఖర్చు

తన ఇంటి చుట్టుపక్కల ఉన్న యార్డ్ ను చదును చేయాలని, అందుకు ఉచితంగా మట్టి కావాలని, ఎవరైనా తెచ్చి ఇవ్వాలని ఓ యువతి తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన ఓ యువతి కొత్త కష్టాన్ని కొనితెచ్చుకుంది. ఈ ఘటన యూఎస్ లోని వర్జీనియా సమీపంలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది.

 రోజ్ మేరీ వేగా అనే యువతి ఫేస్ బుక్ లో తన ఇంట్లోకి మట్టి కావాలని ఓ యాడ్ పెట్టింది. అంతే.. ఆ మరుసటి రోజు నుంచి జనాలు మట్టి తెచ్చి ఆమె యార్డ్ లో పోయడం ప్రారంభించారు. ఒక ట్రక్ 10 ట్రక్ లయింది. 10 ట్రక్ లు 50 ట్రక్కులయ్యాయి. మొత్తం మీద 100 ట్రక్కులకు పైగా మట్టిని ఆమె యార్డులో పోసేసి వెళ్లిపోయారు జనాలు.

అలా వారు తెచ్చిచ్చిన ఇసుక దాదాపు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరింది. ఆ ఆవరణలోని 13 చెట్లు ధ్వంసం అయ్యాయి. దీంతో అవాక్కైన ఆమె, అవసరం లేని మట్టిని తొలగించడానికి 2.5 లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఈ మొత్తం ఘటన ఆమెను కన్నీరు పెట్టించింది. భర్తకు దూరమై, హౌస్ క్లీనింగ్ వ్యాపారాన్ని నడుపుకుంటున్న తనకు, ఈ మట్టి వ్యవహారం పెద్ద చిక్కునే తెచ్చి పెట్టిందని వాపోయింది.

  • Loading...

More Telugu News