Pawan Kalyan: కేసులు వెనక్కి తీసుకోకపోతే సత్తా చూపిస్తాం: పవన్ కల్యాణ్

  • గాజువాకను వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్న పవన్
  • అవంతి, అంబటి నోళ్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
  • వివేకా హత్య, కోడికత్తి కేసులు ప్రభుత్వంపై వేలాడుతున్నాయని వ్యాఖ్యలు

ఇటీవలి ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖ జిల్లా గాజువాక వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్థానిక కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నేతలపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోకుంటే సత్తా చూపిస్తామని అన్నారు.

కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేస్తూ.. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ పోరాటాలపై వివరించారు. గాజువాకను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివేకా హత్య, కోడికత్తి కేసులు వైసీపీ ప్రభుత్వంపై వేలాడుతున్నాయన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ్యుడు అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

Pawan Kalyan
party workers meet
gajuwaka
cases withdraw demand
  • Loading...

More Telugu News