Andhr: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: చంద్రబాబు నాయుడు

  • ఏపీలో ఉచిత ఇసుక పాలసీ తేవాలి
  • కార్మికులు పనిలేక రోడ్డున పడ్డారు
  • మద్దతుగా 14న దీక్ష చేపడుతున్నా

ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వారి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పార్టీ పరిశీలకుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనిలేక, ఆదాయం లోపించి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతుగా ఈ నెల 14న దీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

Andhr
Chandrababu
sand policy
building labourers
  • Loading...

More Telugu News