Ayodhya Case: అయోధ్య కేసుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. యూపీకి భారీగా తరలుతున్న బలగాలు

  • అయోధ్య స్థల వివాదంపై ఏరోజైనా వెలువడనున్న సుప్రీం తీర్పు
  • యూపీకి తరలనున్న 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలు
  • సున్నితమైన 12 ప్రాంతాల్లో మోహరింపు

అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఏరోజైనా తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో... దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో, అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు.

Ayodhya Case
Supreme Court
Paramilitary
  • Loading...

More Telugu News