Gurunatham: తహసీల్దారు విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గురునాథం కూడా మృతి!

  • తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన గురునాథం
  • 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించి మృతి

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి, మంటల్లో కాలి బూడిదవుతుంటే, ఆమెను కాపాడేందుకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ గురునాథం ఈ ఉదయం మరణించాడు. సూర్యాపేటకు చెందిన గురునాథం, గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది.

నిన్న సురేశ్, తహసీల్దారు గదిలోకి వెళ్లి, తలుపులు బిగించి, ఆమెకు నిప్పంటించిన వేళ, తొలుత తలుపులను పగులగొట్టి, లోపలికి దూసుకెళ్లింది గురునాథమే. ఈ ఘటనలో అతనికి 80 శాతం మేరకు గాయాలు కాగా, అపోలో ఆసుపత్రికి తరలించి, చికిత్సను అందించారు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Gurunatham
Vijayareddy
Tahasildar
Fire Accident
  • Loading...

More Telugu News