Tahasildar: తహసీల్దార్ విజయారెడ్డిని తగలబెట్టిన వ్యక్తి పేరు సురేశ్!

  • తహసీల్దార్ ను ఆమె కార్యాలయంలోను తగలబెట్టిన సురేశ్
  • సురేశ్ ది గౌరెల్లి గ్రామం
  • విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం

హైదరాబాదులోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో మహిళా తహసీల్దార్ విజయారెడ్డిని ఓ దుండగుడు కిరోసిన్ పోసి తగలబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని సురేశ్ గా గుర్తించారు. గౌరెల్లి గ్రామవాసిగా అతన్ని గుర్తించారు. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసుల అదుపులో హంతకుడు ఉన్నాడు.

తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ తో విజయను తగలబెట్టిన తర్వాత... సురేష్ తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ఉన్న అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హత్యకు గురైన విజయారెడ్డి స్వగ్రామం శాలిగౌరారం మండలం పెరకకొండారం.

మరోవైపు, విజయ హత్యపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Tahasildar
Vijaya
Murder
Hyderabad
  • Loading...

More Telugu News