kanna laxminarayana: లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు: కన్నా లక్ష్మీ నారాయణ

  • దీనికి కారణం ఏపీ సర్కారే 
  • ఇసుక కొరత సమస్యపై రేపు విజయవాడలో ధర్నా
  • కార్మికులందరికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత వల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. దీనికి కారణం ఏపీ సర్కారేనని ఆరోపణలు చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక కొరత సమస్యపై రేపు విజయవాడలో ధర్నా చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక కొరతను ఏపీ ప్రభుత్వమే సృష్టించిందని  కన్నా లక్ష్మీనారాయణ  అన్నారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సమస్యపై తాము మొదటి నుంచీ పోరాడుతూనే ఉన్నామని చెప్పారు.

kanna laxminarayana
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News