Pawan Kalyan: చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ స్టేజ్‌ ఆర్టిస్ట్‌ : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఘాటు విమర్శ

  • ఇప్పటికీ రాజకీయ నేతగా ఆయన పరిణతి సాధించలేదు
  • అందుకే ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు
  • తాటాకు చప్పుళ్లకు జగన్‌ ప్రభుత్వం భయపడదు

పవన్‌ కళ్యాణ్‌లాంటి రాజకీయ పరిణతిలేని సినిమా యాక్టర్లు చేసే తాటాకు చప్పుళ్లకు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం భయపడదని ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి అన్నారు. సినిమా నటుడి నుంచి రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన పవన్‌ కళ్యాణ్‌ పోకడలు చూస్తే ఇప్పటికీ ఆయన రాజకీయ నాయకుని స్థాయికి ఎదగలేకపోయారని అన్నారు. విశాఖలో ఈరోజు పవన్‌కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌ నేపథ్యంలో కృష్ణమూర్తి పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాలకు ఉపయోగపడే స్టేజ్‌ ఆర్టిస్ట్‌ అని ఎద్దేవా చేశారు.

అందుకే ఆయన పోకడల్లో పరిణతి కనిపించడం లేదన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ విమర్శించిన పవన్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా విమర్శిస్తున్నారంటే చంద్రబాబు ఎజెండాయే ఆయన అజెండా అని అర్థం కావడం లేదా? అని గుర్తు చేశారు.

ఇసుక కొరత ప్రస్తుతం ప్రభుత్వం చేతిలోలేకుండా పోయిందని, వరదలు తగ్గాక సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్‌ కళ్లు తెరిచి సొంత విధానాన్ని ఏర్పర్చుకోవాలని సూచించారు.

Pawan Kalyan
sand policy
long march
MLC janga krishnamurty
  • Loading...

More Telugu News