Rajinikanth: ఇఫ్ఫి అవార్డు దక్కడంపై రజనీకాంత్ వ్యాఖ్యలు

  • రజనీకాంత్ కు 'ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ' పురస్కారం
  • ప్రకటించిన కేంద్రం
  • ఇఫ్ఫి-2019 సందర్భంగా అవార్డు ప్రదానం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం 'ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఇఫ్ఫి-2019' అవార్డు ప్రకటించింది. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి) సందర్భంగా రజనీకాంత్ కు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. దీనిపై రజనీకాంత్ స్పందించారు. కేంద్రం తనకు విశిష్ట అవార్డు ప్రకటించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.

"చిత్ర పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులు, స్నేహితులు, సహచరులతో పాటు రాజకీయనేతలకు, ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైన అభిమానులకు కృతజ్ఞతలు. నాకు అవార్డు ప్రకటించారని తెలియగానే హార్దిక శుభాకాంక్షలు అందజేసిన అందరికీ ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.

Rajinikanth
IFFI
Icon Of Golden Jubilee
  • Loading...

More Telugu News