Crime News: ఏపీలో ఇసుక కొరత కారణంగా పనుల్లేక... ఇద్దరు తాపీ మేస్త్రీల ఆత్మహత్య

  • గుంటూరు జిల్లాలో వేర్వేరు ఘటనలు
  • పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు
  • భవిష్యత్తు అర్థంకాక బలవన్మరణం

ఏపీలో ఇసుక కొరత ఇద్దరు తాపీ మేస్త్రీల ప్రాణాలు తీసింది. సర్కారు కొత్తపాలసీ కారణంగా గడచిన ఐదు నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వారు సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు బలవంతంగా ప్రాణం తీసుకున్నారు. జిల్లాలోని పొన్నూరు గ్రామానికి చెందిన ఆడపా రవి పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. దీంతో ఈరోజు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో కూడా మరో తాపీ మేస్త్రీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కానరాక దారుణానికి ఒడిగట్టాడు.

Crime News
labour suicide
sand problem
  • Loading...

More Telugu News