: రీ-వెరిఫికేషన్, రీకౌంటింగ్ కు అన్ని సబ్జెక్టులకు ఛాన్స్


పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు, తక్కువ మార్కులు వచ్చాయనుకునే విద్యార్థులు ఈసారి అన్ని సబ్జెక్టుల్లో రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించారు విద్యా శాఖాధికారులు. గత ఏడాది ఈ అవకాశం ఐదు సబ్జెక్టులకే పరిమితంకాగా, తాజాగా అన్ని సబ్జెక్టులకి దీనిని విస్తరించారు. రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించిన అధికారులు, ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలను చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక రీకౌంటింగ్ కోసం ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఫారాలు డీఈవొ కార్యాలయంలో కానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దగ్గర్నుంచి కానీ పొందవచ్చన్నారు. లేదంటే www.bseap.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News