mission build: వైఎస్సార్‌ హయాంలో వాన్‌పిక్‌...జగన్‌ హయాంలో మిషన్‌ బిల్డ్‌ : మాజీ మంత్రి సుజయ్‌ ఘాటు విమర్శలు

  • తండ్రి హయాంలో వేల కోట్లు దోచుకున్నారు
  • కొడుకు కూడా అదే మార్గం అనుసరిస్తున్నారు
  • లేదంటే ప్రభుత్వ భూములు విక్రయించే హక్కు వీరికి ఎక్కడిది

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘మిషన్‌ బిల్డ్‌’ విధానంపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సుజయ్‌కృష్ణ రంగారావు ఘాటు విమర్శలు చేశారు. నాడు వైఎస్సార్‌ హయాంలో వాన్‌పిక్‌ లాంటి కుంభకోణాలతో వేలాది ఎకరాలు కొల్లగొట్టారని, ఇప్పుడు తండ్రి అడుగు జాడల్లోనే తనయుడు జగన్‌ నడుస్తున్నారని విమర్శించారు.

గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చిన వారికి ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నంలో భాగం ఇదని విమర్శించారు.

సంపద పెంచే ప్రయత్నం చేయకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఓ వైపు పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కొంటామని చెబుతూ, మరోవైపు ప్రభుత్వ భూములు అమ్ముతామనడంలోనే ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు.

గతంలో చంద్రబాబు ఆదాయం పెంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇప్పుడీ ప్రభుత్వం రివర్స్‌లో వెళ్తోందని ఎద్దేవా చేశారు.

mission build
sujaykrishna rangarao
vanpic
govt.land
  • Loading...

More Telugu News