Hyderabad: ప్రాణాపాయ పద్ధతిలో బంగారం స్మగ్లింగ్.. దొరికిపోయిన నిందితుడు!

  • పట్టుకున్న శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు
  • దుబాయ్‌ ప్రయాణికుడి నుంచి 667 గ్రాముల బంగారం స్వాధీనం
  • విలువ 25 లక్షల రూపాయల పైమాటే

ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా ఏదోలా అక్రమ మార్గంలో బంగారాన్ని చేర్చడమే లక్ష్యంగా అతను తన ప్రయత్నాన్ని కొనసాగించినా అధికారుల అనుమానంతో గుట్టురట్టయింది. పేస్టులా మార్చిన బంగారాన్ని గొట్లాల్లో నింపి వాటిని మలద్వారంలో భద్రపరిచి తీసుకురావాలన్న అతని ప్రయత్నం  శంషాబాద్‌ విమానాశ్రయం ఇంటెలిజెన్స్‌ అధికారుల తనిఖీలతో బెడిసికొట్టింది.

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌ దుబాయ్‌ నుంచి ఎయిర్‌లైన్స్‌ 6ఈ-026 విమానంలో బయుదేరాడు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో బంగారాన్ని మలద్వారంలో దాచాడు. శంషాబాద్‌లో దిగిన అతని నడకలో తేడా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకుని పరీక్షించడంతో విషయం బయటపడింది. అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఈ బంగారం విలువ 25 లక్షల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా వేశారు. బంగారంతోపాటు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న 1.81 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లు, బురఖాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News