Jagan: మంచి చేస్తే ఓర్వలేకపోతున్నారు: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు
- వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష
- చంద్రబాబుపై విమర్శలు
- చంద్రబాబు వేలెత్తి చూపడానికే ప్రాధాన్యం ఇస్తారంటూ విమర్శలు
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏదైనా మంచి పని జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి వాళ్లు వేలెత్తి చూపడానికే ప్రాధాన్యం ఇస్తారని, ఏ చిన్న పొరబాటు జరిగినా అవినీతి జరిగిందని, అన్యాయం జరిగిందని అసత్య ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు.
అందుకోసమే, గ్రామసచివాలయాల పక్కన ఏర్పాటు చేసే ఎరువులు, పురుగుమందులు, విత్తన దుకాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు ఆదేశిస్తున్నామని జగన్ తెలిపారు. నాణ్యతకు ప్రభుత్వమే హామీ ఇస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ముఖ్య అధికారులు హాజరయ్యారు.