Jogu ramanna: ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తే... ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: జోగు రామన్న

  • అవినీతిపై చర్చకు సిద్ధం
  • ఆదివాసీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు
  • బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాట తప్పారు

అవినీతికి ఎవరు పాల్పడ్డారో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఆదివాసీల ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. ఎస్టీల జాబితానుంచి లంబాడాలను ఒక్క సంతకంతో తొలగిస్తామన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆ పని ఎందుకు చేయలేదని రామన్న నిలదీశారు. ఆయన మాట తప్పారన్నారు. జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ ‘ లంబాడాలను ఎస్టీ జాబితానుంచి తొలగిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలతో చెప్పిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని సవాల్ విసిరారు.

Jogu ramanna
TRS
telangana
  • Loading...

More Telugu News