Tharun Bhaskar: నేను సంపాదించిన దాంట్లో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను: విజయ్ దేవరకొండ

  • దర్శకుడు  షమ్మీర్ సుల్తాన్ కి మాట ఇచ్చాను 
  • కథ నచ్చడం వలన రంగంలోకి దిగాను 
  • ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్న విజయ్ దేవరకొండ 

ఒక వైపున హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగాడు. ఆయన నిర్మాతగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో 'మీకు మాత్రమే చెప్తాను' రూపొందింది. తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ .. అభినవ్ గోమఠం ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'పెళ్లి చూపులు' సమయంలోనే షమ్మీర్ సుల్తాన్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి మాట ఇచ్చాను. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కథ నచ్చడంతో .. నేను ఇంతవరకూ సంపాదించిన దానిలో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను. టీమ్ అంతా కష్టపడి మంచి అవుట్ పుట్ తెచ్చారు. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చాడు.

Tharun Bhaskar
Anasiya
Vani Bhojan
  • Loading...

More Telugu News