Republican Party of India: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే మా మద్దతు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

  • బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ దక్కింది
  • ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నిక 
  • మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అథవాలే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాము బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే మద్దతిస్తామంటూ స్పష్టంచేశారు.

ఈ రోజు రాందాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ దక్కిందని, ఇప్పటికే బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఫడ్నవీస్ ఎన్నికయ్యారని గుర్తు చేశారు. సీఎం పదవి కోసం ఆయనకే మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించామని చెప్పుకొచ్చారు.

Republican Party of India
Ramdas Athawale
Maharashtra
  • Loading...

More Telugu News