Jamuna: అప్పట్లో జమున ప్రయాణిస్తున్న బస్సు, ప్రమాదానికి గురైందట!

  • శ్రీకాకుళం నుంచి స్పెషల్ బస్సులో బయలుదేరాము 
  • రాత్రివేళలో బస్సుకి ఒక ముసలావిడ అడ్డుగా వచ్చేసింది 
  • ఊళ్లో వాళ్లంతా అక్కడికి చేరుకున్నారన్న ఈశ్వర్

సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ .. జమున గురించి మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "జమునగారు ప్రజా నాట్యమండలి నుంచి రావడం వలన ఆమెలో సామాజిక సేవా భావం ఎక్కువగా ఉండేది. కళలు .. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. అందులో భాగంగా నిధులను సమకూర్చడం కోసం ఆమె కొంతమంది లేడీ ఫిల్మ్ స్టార్స్ తో ముఖ్యమైన పట్టణాలలో 'స్టార్ నైట్' ఏర్పాటు చేశారు.

ఆ ప్రదర్శనల కవరేజీ కోసం 'విజయచిత్ర' తరఫున నేను వెళ్లాను. శ్రీకాకుళంలో ప్రదర్శన ముగించుకుని మేమంతా స్పెషల్ బస్సులో గుంటూరు వెళుతుండగా, రాత్రివేళ మా బస్సుకు ఒక ముసలావిడ అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. ఊళ్లో జనమంతా అక్కడ పోగయ్యారు. బస్సు లోపల అంతా లేడీ ఆర్టిస్టులు. ఆ విషయం అక్కడి వాళ్లకి తెలిస్తే మరింత సమస్య అవుతుంది. అందువలన నేను .. జమున సోదరుడు మాత్రమే బస్సు దిగి, పోలీసులకి సమాచారాన్ని అందించాము. వాళ్లు వచ్చేవరకూ ఎలాంటి గొడవ జరక్కుండా ఊళ్లో వాళ్లతో మంచిగా మాట్లాడుతూ సమయాన్ని గడిపాము. ఇప్పటికీ అది ఒక భయంకరమైన అనుభవంలాగే అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News