union government: ఇక అబ్బాయిలు తొందరగా పెళ్లాడొచ్చు.. పురుషుల పెళ్లీడును కూడా 18 ఏళ్లు చేసే యోచనలో కేంద్రం!

  • అమ్మాయిలతో సమానంగా అబ్బాయిల వయసు ఉండాలంటూ పిల్
  •  బాల్య వివాహ నిషేధ చట్ట సవరణకు చర్చలు జరుపుతున్నామన్న కేంద్రం
  • ఫిబ్రవరి 19కి తదుపరి విచారణ వాయిదా

ఇక అబ్బాయిలు తొందరగా పెళ్లాడొచ్చు. ప్రస్తుతం ఉన్న పురుషుల వివాహ వయసు 21 ఏళ్లను మూడేళ్లు తగ్గించి అమ్మాయిలతో సమానంగా 18 ఏళ్లు చేయాలని కేంద్రం యోచిస్తోంది. బాల్య వివాహ నిషేధ చట్టంలో సవరణపై ఇటీవల నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్టు ఢిల్లీ హైకోర్టుకు నిన్న కేంద్రం తెలియజేసింది.

వివాహం విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల వయసు ఒకేలా ఉండాలంటూ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నేత  అశ్విని ఉపాధ్యాయ్‌ పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కేంద్రం తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణ కోసం మహిళాశిశు అభివృద్ధి శాఖతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు పలు చట్టాలను మార్చాల్సి ఉండడంతో న్యాయశాఖను కూడా కక్షిదారుగా చేర్చాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

union government
marriage
boys
age
  • Loading...

More Telugu News