IRCTC: రైల్వే ఈ -టికెట్ లు రద్దు చేసుకుంటే డబ్బు వాపస్!
- ఐఆర్ టీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ ప్రారంభం
- అధికారిక టికెటింగ్ ఏజెంట్ల వద్ద బుకింగ్ లకే వెసులుబాటు
- వెయిటింగ్ జాబితాలో ఉన్న టికెట్ల క్యాన్సిల్ కు వర్తింపు
ఇక రైల్వే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాన్ని రద్దుచేసుకుంటే వారికి ప్రయాణ చార్జీలు రిఫండ్ గా ఎంతవస్తాయో వారికి మొబైల్ సంక్షిప్త సందేశంలో తెలిసిపోతుంది. ఈ- టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ పద్ధతిలో ప్రయాణికులు తమ డబ్బును తిరిగి పొందడం సులువు కానుంది.
టికెట్ రద్దుచేయాలన్న ఆప్షన్ ను ఎన్నుకుంటే, ఆ ప్రయాణికుడి మొబైల్ కు రైల్వేశాఖ సంక్షిప్త సందేశంలో ఓటీపీ నెంబర్ పంపుతుంది. ఆ నెంబర్ ను తాము టికెట్ బుక్ చేసుకున్న ఏజెంట్ కు చూపితే వారు నగదును తిరిగి ఇస్తారు. ఐఆర్ టీసీ అనుమతిపొందిన టికెట్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ- టికెట్ల విషయంలో పారదర్శకత, యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభించినట్లు ఐఆర్ టీసీ వెల్లడించింది.