Guntur District: యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న పిన్నమ్మ... కేసు నమోదు!

  • తరచూ పిన్ని ఇంటికి వచ్చి వెళ్లే యువతి
  • నిద్రమత్తులో ఉన్న వేళ అసభ్య చిత్రాలు
  • చూపించి బెదిరిస్తుంటే పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కన్న బిడ్డ వంటి యువతి ఇంటికి వస్తే, ఆమెకు మత్తు మందిచ్చి, మరో వ్యక్తిని పంపించి, ఫొటోలు తీసి బెదిరిస్తున్న ఓ పినతల్లి ఇప్పుడు అడ్డంగా బుక్కయింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నరసరావుపేటకు చెందిన ఓ యువతి, బుక్కాపురంలో ఉండే తన పిన్నమ్మ వద్దకు తరచూ వచ్చి పోతుండేది.

ఈ క్రమంలో దాదాపు నెల క్రితం మరోసారి ఆమె బుక్కాపురం రాగా, పిన్నమ్మ ఆమెకు మత్తు మందిచ్చింది. ఆ మత్తులో డాబాపై పడుకుని నిద్రిస్తున్న యువతి దగ్గరకు మరో వ్యక్తిని పంపింది. అతనితో సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఫోటోలు తీయించింది. ఆపై ఆమెను డబ్బులకు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే, ఫొటోలు బయట పెడతానని బెదిరింపులకు దిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

Guntur District
Photos
Drugs
Intoxicated
Police
  • Loading...

More Telugu News