Sarileru Neekevvaru: రేర్ పిక్... విజయశాంతి ఏదో చెబితే నవ్వులు చిందిస్తున్న మహేశ్ బాబు!

  • షూటింగ్ స్పాట్ లో ఘటన
  • చిత్రంలో ప్రకాశ్ రాజ్ కూడా
  • 12న ప్రేక్షకుల ముందుకు 'సరిలేరు నీకెవ్వరు'

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదే సినిమా ద్వారా విజయశాంతి, టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు కూడా. ఇక ఈ సినిమా సెట్స్ లో తీసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విజయశాంతి ఏదో చెబుతుంటే, మహేశ్ బాబు నవ్వుతున్న చిత్రం ఒకటి బయటకు వచ్చింది. ఇదే పిక్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల దీపావళి సందర్భంగా విజయశాంతి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, అది వైరల్ అయింది. మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్ నటిస్తున్న సినిమా జనవరి 12న సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ముగ్గురు స్టార్లతో ఉన్న ఈ పిక్ ను యూనిట్ విడుదల చేయగా, నెట్టింట అది చక్కర్లు కొడుతోంది.

Sarileru Neekevvaru
Vijayasanthi
Mahesh Babu
Shooting
  • Loading...

More Telugu News