Hardhik Pandya: తన లవర్ కోసం రంగంలోకి దిగిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా... గెలిపించాలని పిలుపు!

  • నాచ్ బలీయేలో స్టాన్ కోవిచ్ పోటీ
  • ఓట్లు వేయాలని ఫ్యాన్స్ కు పిలుపు
  • త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం

ఇటీవలే వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హార్దిక్, సోషల్ మీడియాలో తన ప్రేయసి నటాషా స్టాన్ కోవిచ్ గెలిచేలా, ప్రతి ఒక్కరూ ఓట్ చేయాలని కోరాడు. తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, అభిమానుల ఓట్లు ఇప్పుడు ఆమెకెంతో కీలకమన్నాడు.

కాగా, తన తొలి ప్రియుడు అలీతో కలిసి ఈ పోటీల్లో స్టాన్ కోవిచ్ పాల్గొంటుండటం గమనార్హం. ఇక చానాళ్లుగా కలిసి పార్టీలకు, పబ్బులకు తిరుగుతూ హల్ చల్ చేస్తున్న హార్దిక్, నటాషాల జంట లవ్ స్టోరీకి త్వరలోనే శుభంకార్డు పడనుందని కూడా తెలుస్తోంది. మొన్న దీపావళి వేడుకల వేళ, హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య, ఆయన భార్య సంఖూరీ ఏర్పాటు చేసిన వేడుకలకు నటాషా కూడా హాజరైంది. వీరిద్దరి పెళ్లికి ఇంటి పెద్దలు కూడా అంగీకరించినట్టు సమాచారం.

Hardhik Pandya
Natasha Stankowich
Lovers
Nach Balie
  • Loading...

More Telugu News