NIA: ఎన్ఐఏకి ఆకాశ రామన్న ఉత్తరం... కోహ్లీ సహా ఇతర క్రికెటర్ల భద్రత పెంపు

  • ఆలిండియా లష్కర్ పేరుతో లేఖ
  • లేఖను బీసీసీఐకి పంపిన ఎన్ఐఏ
  • లేఖలో రాష్ట్రపతి, ప్రధాని పేర్లు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తాజాగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేఖ అందింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర టీమిండియా క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. ఈ లేఖ ఆలిండియా లష్కర్ ఉగ్రవాద సంస్థ పేరుతో వచ్చింది. ఈ సంస్థ కేరళలోని కోజికోడ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ లేఖను ఎన్ఐఏ బీసీసీఐకి కూడా పంపింది.

ఆ లేఖలో అంశాలకు విశ్వసనీయత లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 3న భారత జట్టు ఢిల్లీలో బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీస్ విభాగం నిర్ణయించింది.

కాగా, ఈ లేఖలో క్రికెటర్ల పేర్లు మాత్రమే కాదు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లకు కూడా ముప్పు ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News