Mega Family Movie: 'మెగా ఫ్యామిలీ' చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

  • 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తికి సంబంధించిన సినిమా ఇది
  • పిల్లల సినిమాలను తీయడంలో నాకు అనుభవం లేదు
  • అందుకే సినిమా తీయవద్దని నిర్ణయించుకున్నా

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో వివాదాల తుట్టెను కదిలించిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. తన తదుపరి చిత్రం 'మెగా ఫ్యామిలీ' అంటూ అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను రేపు ప్రకటిస్తానని చెప్పారు. అయితే, 'మెగా ఫ్యామిలీ' సినిమాను తాను తెరకెక్కించడం లేదని కాసేపటి క్రితం మరో ట్వీట్ చేశారు. 'మెగా ఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రమని చెప్పారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారని... పిల్లల సినిమాలను చిత్రీకరించడంలో తనకు అనుభవం లేదని... అందుకే ఈ సినిమాను తెరకెక్కించకూడదని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.

Mega Family Movie
Ram Gopal Varma
Tollywood
  • Loading...

More Telugu News