Nawaaj Shareef: నవాజ్ షరీఫ్ ఆరోగ్యం అత్యంత విషమం... డిశ్చార్జ్ చేసేందుకు వైద్యుల నిరాకరణ!

  • కనిష్ఠానికి ప్లేట్ లెట్స్ సంఖ్య
  • ఒక్క రోజులో 25 వేలకు పడిపోయిన ప్లేట్ లెట్స్ కౌంట్
  • ప్రస్తుతం సర్వీసెస్ ఆసుపత్రిలో చికిత్స

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింతగా విషమించిందని ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లు వెల్లడించారు. ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నారని, రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ కనిష్ఠానికి పడిపోయిందని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టేనని అంటున్నారు.

ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న నవాజ్ షరీఫ్ రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య ఒక్కరోజులోనే 45 వేల నుంచి 25 వేలకు పడిపోయాయని తెలుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో నిన్న రాత్రి సర్వీసెస్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన పరిస్థితి కుదుటపడేంత వరకూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయలేమని జైలు అధికారులకు వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగని కారణంగా స్వల్ప గుండెపోటుకు కూడా గురయ్యారు.

Nawaaj Shareef
Pakistan
Hospital
  • Loading...

More Telugu News