Abu Bakar: అల్ బాగ్దాదీ మృతదేహం మరెవరికీ కనిపించకుండా, దొరక్కుండా చేసిన యూఎస్ ఆర్మీ!

  • రెండు రోజుల క్రితం బాగ్దాదీ హతం
  • సముద్రంలో అవశేషాలను ఖననం చేసిన యూఎస్ సైన్యం
  • నిబంధనల ప్రకారమే జరిగిందన్న పెంటగాన్ వర్గాలు

రెండు రోజుల క్రితం ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికన్ సైన్యం చుట్టుముట్టడంతో, తను ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహం మరెవరికీ కనిపించకుండా, దొరక్కుండా మాయం చేసింది. ఆయన మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేసినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. మరే విధమైన వివరాలనూ అందివ్వని పెంటగాన్ వర్గాలు, 2011లో అల్ ఖైదా చీఫ్ ఓసామా బిన్ లాడెన్ ను ఖననం చేసినట్టే, అల్ బాగ్దాదీ అవశేషాలను కూడా ఖననం చేశామని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ వెల్లడించారు. యూఎస్ మిలిటరీ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమం జరిగిందని ఆయన అన్నారు. కాగా, అమెరికన్ సైన్యం చుట్టుముట్టిన వేళ, తనను తాను పేల్చేసుకుని బాగ్దాదీ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Abu Bakar
Sea
Dead Body
Decease
USA
army
  • Loading...

More Telugu News