TSRTC: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై మంద కృష్ణ వ్యాఖ్యలు

  • హుజూర్ నగర్ విజయంతో కేసీఆర్ కు అహంకారం వచ్చిందన్న మంద కృష్ణ
  • కోర్టు శిక్షవేయకపోయినా ప్రజలు వేస్తారంటూ వ్యాఖ్యలు
  • సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను సీఎం కేసీఆర్ అలక్ష్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు. కేసీఆర్ మాటలతో ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్ నీరజ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిని విమర్శించారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో సాధించిన గెలుపుతో కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ కు కోర్టు శిక్ష వేయకపోయినప్పటికి, ప్రజలు వేస్తారన్నారు.

TSRTC
Telangana
KCR
Manda Krishna
  • Loading...

More Telugu News