Dhanteras: ధన్ తేరస్ విక్రయాల్లో దూసుకుపోయిన మారుతి, మహీంద్రా

  • కొంతకాలంగా నిరాశాజనకంగా వాహన విక్రయాలు
  • ధన్ తేరస్ నాడు భారీగా అమ్మకాలు
  • ఆటోమొబైల్ రంగంలో కొత్త ఉత్సాహం

దీపావళి సందర్భంగా కాస్త ముందుగా జరుపుకునే వేడుక ధన్ తేరస్. ధన్ తేరస్ నాడు కొనుగోళ్లు జరపడాన్ని చాలామంది సెంటిమెంట్ గా భావిస్తారు. కలిసొస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది కూడా ధన్ తేరస్ సందర్భంగా అమ్మకాలు భారీగా జరిగాయి. ముఖ్యంగా, ఆటోమొబైల్ రంగంలో విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొంతకాలంగా నిరాశాజనకంగా ఉన్న ఆటోమొబైల్ రంగంలో ధన్ తేరస్ విక్రయాలు కొత్త ఉత్సాహం కలిగించాయి.

ఒక్క మహీంద్రా సంస్థనే ధన్ తేరస్ రోజున 13,500 వాహనాలను వినియోగదారులకు అందించింది. మారుతి సుజుకీ మరింత భారీగా 45,000 విక్రయాలు జరిపింది. ప్రీమియం సెగ్మెంట్లో బెంజ్ సంస్థ కూడా 600 విక్రయాలు జరిపింది. హ్యుందాయ్ 12,500, ఎంజీ మోటార్స్ 700 వాహనాలను డెలివరీ చేశాయి.

Dhanteras
Maruti Suzuki
Mahindra
  • Error fetching data: Network response was not ok

More Telugu News