Sye Raa Narasimha Reddy: హిందీలో 'సైరా' నిరాశపరచడంపై రాంచరణ్ స్పందన

  • హిందీ మార్కెట్లో సినిమాను బాగా ప్రమోట్ చేయగలిగాం
  • హృతిక్ రోషన్ నటించిన 'వార్'తో 'సైరా' పోటీ పడాల్సి వచ్చింది
  • దక్షిణాది రాష్ట్రాల్లోనే 'సైరా' రూ. 275 కోట్ల వరకు రాబట్టింది

'సైరా' సినిమాతో చిరంజీవి మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, ఉత్తర భారతంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశపరిచింది. దీనిపై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'సైరా' మూవీ విడుదలైన సమయంలోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'వార్' చిత్రం విడుదలైందని చరణ్ చెప్పాడు. 'వార్'తో 'సైరా' పోటీ పడాల్సి రావడమే... బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గడానికి కారణంగా తాము భావిస్తున్నామని తెలిపాడు. హిందీ మార్కెట్లో సినిమాను తాము బాగా ప్రమోట్ చేయగలిగామని... కలెక్షన్లు బాగానే వస్తాయని భావించామని చెప్పాడు. ఏదేమైనప్పటికీ 'వార్' చిత్రం రూ. 300 కోట్లు వసూలు చేసిందని... దక్షిణాది రాష్ట్రాల్లోనే 'సైరా' రూ. 275 కోట్ల వరకు రాబట్టిందని తెలిపాడు. ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Ramcharan
Collections
Bollywood
Tollywood
War Movie
Hrithik Roshan
  • Loading...

More Telugu News