Haryana: హర్యానా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్

  • ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ-జేజేపీ కూటమి
  • ఖత్తర్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
  • చండీగఢ్ లో ప్రమాణస్వీకారోత్సవం

హర్యానా రాజకీయ అనిశ్చితికి తెరపడింది. బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకగా, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖత్తర్ ప్రమాణస్వీకారం చేశారు. ఖత్తర్ తో రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఖత్తర్ సీఎంగా వ్యవహరించడం ఇది రెండోసారి. గత ప్రభుత్వంలోనూ ఆయనే ముఖ్యమంత్రి అన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో స్థానిక పార్టీ అయిన జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాగా,  ఖత్తర్ ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

Haryana
Manohar Lal Khattar
BJP
JJP
  • Loading...

More Telugu News