Kodandaram: ఆర్టీసీ కార్మికులను యుద్ధ ఖైదీల్లా చూశారు: కోదండరాం
- కోర్టు చేసిన సూచనలను పాటించాలి
- తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం చూస్తోంది
- తెలంగాణ సర్కారు సరైన రీతిలో స్పందించాలి
నిన్నటి చర్చల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను యుద్ధ ఖైదీల్లా చూశారని అధికారులపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ విషయంలో కోర్టు చేసిన సూచనలను పాటించాలని ఆయన సూచించారు. తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సర్కారు సరైన రీతిలో స్పందించి వెంటనే చర్చలు సఫలం అయ్యే దిశగా కృషి చేయాలని అన్నారు.
కాగా, ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తమకు సమ్మె విరమించాలనే ఉందని అధికారులను చెప్పామని అన్నారు. నిన్న వారు అసలు చర్చలు జరపలేదని, ఈ రోజు పిలిచినా చర్చలకు వస్తామని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్లు ఉండరాదన్న సీఎం కేసీఆర్ కోరి కూడా నెరవేరుతుందని అన్నారు.