Jaggareddy: హుజూర్ నగర్ లో పద్మావతి గెలిచుంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడు: జగ్గారెడ్డి

  • హుజూర్ నగర్ ఉప ఎన్నికపై జగ్గారెడ్డి స్పందన
  • పద్మావతి ఓటమితో ఉత్తమ్ హీరో అయ్యాడని వ్యాఖ్యలు
  • ఉప ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలమన్న జగ్గారెడ్డి 

తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. హుజూర్ నగర్ లో పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని, పద్మావతి ఓడిపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ అధైర్యవంతుడు కాదని, ఆయనకు ఒకరు ధైర్యం చెప్పాల్సిన అవసరంలేదని అన్నారు. యుద్ధ విమానంలో దేశం కోసం పోరాడిన ఉత్తమ్ కుమార్ కు ఓటమి ఓ సమస్య కాదని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలో ఓడిపోయిందని తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకే ఎక్కువ అనుకూలంగా ఉంటాయని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. హుజూర్ నగర్ ఓటమి కారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఎలాంటి నష్టం వాటిల్లబోదని పేర్కొన్నారు.

Jaggareddy
TRS
Congress
Uttam Kumar Reddy
Revanth Reddy
  • Loading...

More Telugu News