Balakrishna: ప్రఖ్యాత వైద్యురాలు పోలవరపు తులసీదేవి దశదిన కర్మకు హాజరైన బాలకృష్ణ

  • ఇటీవల గుండెపోటుతో మరణించిన తులసీదేవి
  • స్వగ్రామంలో దశదిన కర్మ
  • నివాళులు అర్పించిన బాలయ్య

హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక ట్రస్టీ, ప్రముఖ వైద్యురాలు పోలవరపు తులసీదేవి గత శనివారం న్యూయార్క్ లో గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఆమె దశదిన కర్మను స్వగ్రామం గుంటూరు జిల్లా కంఠంరాజు కొండూరులో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. బసవతారకం ఆసుపత్రి స్థాపన, ఆ తర్వాత కూడా తులసీదేవి అనేక విధాలా సేవలు అందించారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.

Balakrishna
Tulasi Devi
Basavatarakam
Hyderabad
Guntur District
  • Loading...

More Telugu News