Narkatpally: ఆర్టీసీ డ్రైవర్ ది ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు

  • నార్కట్ పల్లిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆర్టీసీ డ్రైవర్
  • ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన పోలీసులు
  • సూసైడ్ నోట్ స్వాధీనం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె తీవ్రతరమైన దశలో నార్కట్ పల్లి డిపో డ్రైవర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. అయితే, ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు. నార్కట్ పల్లి లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సూసైడ్ నోట్ లో ఏముందనే విషయంలో మాత్రం పోలీసులు గోప్యతను పాటిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Narkatpally
Nalgonda District
RTC Driver
Suicide
  • Loading...

More Telugu News