Tamil Nadu: దీపావళి సరుకుల కోసం వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత

  • తమిళనాడులోని మధురైలో ఘటన
  • ఆటోలో బయలుదేరిన 13 మంది
  • నుజ్జునుజ్జయిన ఆటో

తమిళనాడులోని మధురై జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోడంగినాయక్కన్‌పట్టి నుంచి దీపావళి సరుకులు కొనేందుకు 13 మంది వ్యక్తులు ఆటోలో ఉసిలంబట్టికి బయలుదేరారు. కారంబట్టి సమీపంలో వీరి ఆటోను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu
Madurai
Road Accident
  • Loading...

More Telugu News