Student Dies: విద్యుదాఘాతంతో పాఠశాలలో విద్యార్థి మృతి

  • పాఠశాల మైదానంలో చెట్టుకు కట్టిన తీగను పట్టుకున్న విద్యార్థి
  • షాక్ కు గురైన విద్యార్థి
  • విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరే కారణమన్న తల్లిదండ్రులు 

విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరికి విద్యార్థి బలైన ఘటన నిజామాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పులాంగ్ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఐదో తరగతి చదువుతున్న అయాన్ ఖాన్(11) అనే విద్యార్థి పాఠశాల మైదానంలో ఆడుకుంటున్న సమయంలో చెట్టుకు కట్టిన విద్యుత్ తీగను పట్టుకోగా షాక్ కు గురై మరణించాడు. తోటి విద్యార్థులు ఇది గమనించి ఉపాధ్యాయులకు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరివల్లే తమ కుమారుడు మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Student Dies
Electric Shok
Nizamabad District
Telangana
  • Loading...

More Telugu News