health: 45 ఏళ్లలోపే 'బ్రెయిన్‌ స్ట్రోక్‌'కు గురవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది: వైద్యులు

  • 25 శాతం మంది ఈ వయసులోని వారే
  • ఆధునిక జీవన విధానం, ధూమపాన అలవాటు, ఊబకాయమే కారణం
  • మూడు నిమిషాలకొకరు బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో మృతి

'బ్రెయిన్‌ స్ట్రోక్‌' అనగానే ఇది వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చే వ్యాధిగా భావిస్తాం. అయితే, ఒత్తిడితో కూడిన ఆధునిక జీవన విధానం, ధూమపాన అలవాటు, ఊబకాయం కారణంగా మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు 45 సంవత్సరాల వయస్సులోపు వారికి కూడా వస్తోంది.

ప్రమాదకరమైన ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నవారిలో 25 శాతం మంది ఈ వయసులోని వారే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ నెల 29న 'వరల్డ్ స్ట్రోక్‌ డే' సందర్భంగా ప్రతి జిల్లాలో ఒక స్ట్రోక్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వారు భావిస్తున్నారు. దేశంలో ప్రతి మూడు నిమిషాలకొకరు బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా మృతి చెందుతున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News