Haryana: కాసేపట్లో దుష్యంత్ మీడియా సమావేశం.. 'హర్యానాలో జేజేపీ మద్దతు ప్రకటన'పై ఉత్కంఠ

  • పార్టీ ఎమ్మెల్యేలతో దుష్యంత్ చౌతాలా భేటీ
  • తీహార్ జైలుకెళ్లి తన తండ్రిని కలవనున్న జేజేపీ అధినేత
  • ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు వ్యూహాలు?

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేసిన జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలతో సమావేశమయ్యారు.  ఓ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న తన తండ్రి అజయ్‌ చౌతాలాను కూడా ఆయన ఈ రోజు కలవనున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రాష్ట్రంలో 10 సీట్లతో జేజేపీని మూడో అతిపెద్ద పార్టీగా నిలిపి, కింగ్ మేకర్ గా మారిన ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆయన చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను తమ వైపునకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Haryana
jjp
BJP
  • Loading...

More Telugu News