Chandrababu: లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?: ఏపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు
- వైసీపీ ప్రభుత్వం ఇసుక సమస్య సృష్టించింది
- లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారు
- వారందరికీ పరిహారం ఇమ్మని టీడీపీ డిమాండ్ చేసింది
- ఇచ్చేది లేదని మంత్రి మాట్లాడడం నిర్లక్ష్యానికి పరాకాష్ట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ సర్కారు ఇసుక విధానంపై ఆయన మండిపడుతూ ట్వీట్లు చేశారు.
'వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయి లక్షలాది మంది కార్మికులు పస్తులుంటున్నారు. వారందరికీ పరిహారం ఇమ్మని టీడీపీ డిమాండ్ చేస్తే ఇచ్చేది లేదని మంత్రి మాట్లాడడం వైసీపీ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పాత ఇసుక విధానం రద్దు చేయమని కార్మికులు అడిగారా? మీ ఇష్టానుసార నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?' అని చంద్రబాబు నిలదీశారు.