Bandla Ganesh: బండ్ల గణేశ్ కు బెయిల్ మంజూరు

  • బండ్ల గణేశ్ కు రిమాండ్ విధించిన కోర్టు
  • ఊహించని విధంగా బెయిల్ మంజూరు
  • కడప నుంచి హైదరాబాదుకు బయల్దేరిన గణేశ్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు బెయిల్ లభించింది. చెక్ బౌన్స్ కేసులో ఈ మధ్యాహ్నం కడప కోర్టు బండ్ల గణేశ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 4 వరకు ఆయన రిమాండ్ కొనసాగాల్సి ఉంది. అయితే, ఊహించని విధంగా ఆయనకు బెయిల్ రావడం గమనార్హం. మరోవైపు, బెయిల్ రావడంతో... కడప నుంచి హైదరాబాదుకు బండ్ల గణేశ్ బయల్దేరారు. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

Bandla Ganesh
Remand
Bail
Tollywood
  • Loading...

More Telugu News